ఎవరితోనైనా విబేధించవచ్చు కానీ, ప్రత్యర్థులను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. కేవలం గెలుపోటములు మాత్రమే వ్యక్తుల స్థాయిని నిర్దేశించవు. విలువలు , విశ్వసనీయత కూడా వ్యక్తులను అందనంత స్థాయిలో నిలబెడుతాయి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంటారని మరోసారి నిరూపించుకున్నారు. జగన్ రెడ్డి మాత్రం తన సహజస్వభావాన్ని చాటుకొని ఛీ కొట్టించుకుంటున్నారు.
నేడు చంద్రబాబు జన్మదిన కావడంతో ప్రధాని మోడీ సహా ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. అందులో సీఎంకు శుభాకాంక్షలు చెప్తూ మొదట చంద్రబాబు గారు అని పేర్కొనకపోవడంతో… ముఖ్యమంత్రిని గౌరవించాలనే ఇంగింత జ్ఞానం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. వెంటనే చంద్రబాబు గారు అని ఎడిట్ చేశారు జగన్. అయినప్పటికీ నెటిజన్లు శాంతించలేదు. అధికారం పోయినా, అహంకారం మాత్రం తగ్గలేదు అంటూ జగన్ తీరును ఎండగట్టారు.
ఈ నేపథ్యంలోనే జగన్ శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్ కు కాసేపటి క్రితం బదులిచ్చారు చంద్రబాబు. అందులో థాంక్స్ జగన్ గారు అంటూ రిప్లై ఇవ్వడం చూసి.. దటీజ్ చంద్రబాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వ్యక్తులను ఎలా గౌరవించాలో చంద్రబాబు చూసి ఇకనైనా తెలుసుకో అంటూ హితవు పలుకుతున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం కాదు.. ఆచరించాలి.. ఈ సూక్ష్మాన్ని జగన్ ఇంకెప్పుడు నేర్చుకుంటారో!