దిగ్గజ దర్శకుడు మణిరత్నం గుండెనొప్పితో బాధపడుతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ టీవీ ఛానళ్లన్నీ ఈ వార్తని ప్రధానంగా ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారన్నది వార్తల సారాశం. మణిరత్నంకి ఇది వరకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు, చెన్నై ఫిల్మ్ నగర్ వర్గాలు కలవరపడుతున్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణిరత్నం క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కేవలం హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారని, అంతకు మించి ఏం లేదని చెన్నై వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ప్రసార మాధ్యమాల్లో వార్తలు చూసి కంగారు పడొద్దని, మణిరత్నం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు సైతం ధృవీకరించాయి.