చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ప్రజలు మోత మోగించి మరీ అధికారం ఉందని అరాచకానికి దెగబిన వాళ్ల చెవుల్లో తుప్పు వదిలేలా చేశారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచే కాదు సామాన్య జనం నుంచి విశ్లేష స్పందన వచ్చింది. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ ఆగ్రహాన్ని, చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదిలి పెట్టలేదు. గుంటూరులో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్చందంగా తాము ఎక్కడ ఉంటే.. అక్కడ శబ్దం చేసి నిరసన తెలిపారు.
నారా లోకేష్ ఢిల్లీలో.. భువనేస్వరి హైదరాబాద్లో .. బ్రాహ్మణి రాజమండ్రిలో మోత మోగించారు. పిలుపునిచ్చింది ఒక్క రోజు ముందే అయినా.. పార్టీ పరంగా ప్రిపరేషన్స్ ఏమీ లేకపోయినా.. ప్రజలు సమాచారం ఉన్న ప్రజలంతా.. అక్రమ అరెస్టును తమకు చేతనైన పద్దతిలో ఖండించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్య పరిచింది. నిజానికి టీడీపీ సోషల్ మీడియా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ఇలా ప్రకటించుకుని మనమంతా టీడీపీ అభిమానులమని చెప్పుకోవడం ఎందుకని చర్చ పెట్టారు. అలా చేస్తే ఓట్లు తీసేస్తారని భయపడ్డారు. కానీ సామాన్యులు కూడా భయటపడకుండా మోత మోగించారు.
ఏడు గంటల నంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ ఏపీ వ్యాప్తంగా శబ్దాలు వినిపించాయి. హైదరాబాద్, బెంగళూరులోనూ పలు చోట్ల ప్రజలు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేయమని పిలుపునివ్వడంతో.. నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సాధారణంగా పార్టీ ఆర్గనైజ్ చేస్తే.. ఓ రకంగా ఉంటుంది.. ప్రజలు పార్టీసిపేట్ చేస్తే వేరే రకంగాఉంటుంది. ఊహించని విధంగా ఉంటుంది. అలాంటి సిట్యూయేషన్ ఏపీ వ్యాప్తంగా కనిపించింది. ఈ ఉత్సాహంతో ప్రజలందర్నీ ఎంగేజ్ చేసేలా మరికొన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు టీడీపీ రెడీ అయింది.