రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు పడిన ఇబ్బందులకు ఆయనకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. ఆయనపై ఉన్న అభియోగాలన్నింటినీ ఆధారాలు లేవని ఉపసంహరించుకుంది. ఆయనకు కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిన జీత, భత్యాల బకాయిలన్నీ ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఆయనకు పోలీసులతో సంబంధం ఉన్న నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు.
ఏబీ వెంకటేశ్వరరావు ఎవర్నీ వదిలి పెట్టబోనని గతంలో హెచ్చరించారు. ఆయనపై జగన్ హయాంలో పలువుపు ఐపీఎస్‌లే కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గౌతం సవాంగ్ ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ వెంటేశ్వరరావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీడీపీ ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరికొంత మంది సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు టైమ్ వచ్చింది.
ఆయన నామినేటెడ్ పోస్టులో ఉన్నా.. వైసీపీ నేతల సంగతి చూడటానికి అవసరమైన పవర్ కలిగి ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఆయన కాస్తంత పవర్ ఉంటే.. జరగాల్సింది జరిగిపోతుందన్న అంచనాల ుఉన్నాయి. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంలో భాగంగా ఉంటే.. కొంత మంది వైసీపీ నేతలకు చాలా కష్టాలు తప్పవన్న అంచనాలు వేస్తున్నారు. టీడీపీ క్యాడర్ కూడా ఆయనకు ఏదో ఓ పదవి ఇవ్వాలని కోరుకుంటోంది.