ఒక చెక్‌బౌన్స్ కేసుకి సంబంధించి కోర్టు పిలిచినా హాజరుకాని నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకి నాయక చిత్రాల్ని నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి రూ: 50 లక్షల లావా దేవీలకి సంబంధించి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. దాంతో ఆయనపై కేసు నమోదైంది. కోర్టు పలు నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు కోర్టు మిర్యాల రవీంద్రరెడ్డిపై కన్నెర్న చేస్తూ, బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.