ఆంధ్రప్రదేశ్‌లో హిందూ భక్తుల్లో ఎంత అసహనం ఉందో ఇంద్రకీలాద్రిపై గురువారం జరిగిన ఘటన నిరూపిస్తోంది. గురువారం రాత్రి ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ లక్ష్యం ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం. అలా అమ్మవారి సేవలు ప్రత్యక్ష ప్రసారం చేసిన తర్వాత ఆ స్క్రీన్‌పై క్రీస్తు బోధనలు ప్రత్యక్షమయ్యాయి.
ఓ పాస్టర్ వచ్చి బోధనలు ప్రారభించారు. అమ్మవారి ఆలయం ముందు అలా జరగడంతో భక్తులు ఒక్క సారిగా రెచ్చిపోయారు. రాళ్లు వేసి స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయం పెద్దది కాకుండా దుర్గగుడి అధికారులు జాగ్రత్తలుతీసుకున్నారు. బద్దలు కొట్టిన వారిపై కేసులు పెడితే విషయం ఇంకా పెద్దది అవుతుందన్న కారణంగా సైలెంట్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దుర్గగుడికి లైటింగ్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల్లో ఉన్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని మామూలు రంగుల్లోనే ఉన్నాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది. వీడియోలోనూ వైసీపీ రంగులు కనిపిస్తున్నాయి.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా ఇలా జరుగుతూండటంతో భ క్తుల్లో అసహనం పెరిగిపోతోంది. చివరికి భరించలేని స్థితికి చేరుతోంది. రాళ్లతో దాడులు చేసేంత ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేకపోతే యాధృచ్చికంగా జరుగుతున్నాయో కానీ ఇవి హిందూ భక్తుల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి.