అన్యమతస్తులనే పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం 45 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. దేవుడు అందరి వాడైనప్పుడు ఈ మత విచక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా బీబీ నాంచారిని పెళ్లి చేసుకున్న వెంకన్న ఇలా ఎందుకు కోరుకుంటాని నిలదీస్తున్నారు. రాయలసీమ జిల్లాల కలెక్టర్గా పనిచేసిన మన్రో దొర ఆ రోజుల్లో ఒక గంగాళం ఇచ్చారట. మన్రో గంగాళంపేరిట ఇప్పటికీ దాన్ని వేడుకల్లో వాడుతుంటారు. ఆలయ వేడుకల్లోనూ ముస్లింలు పాలు పంచుకునే సందర్భాలు వున్నాయి. గతంలో అర్హతలను బట్టి ఉద్యోగంలోకి తీసుకున్న టిటిడినే ఇప్పుడు ఉన్నఫలానా వీధుల పాలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపైన కేక్ కట్ చేశారంటూ గతంలో గగ్గోలు పెట్టిన వారే ఇప్పుడు కూడా రభస ప్రారంభించారని బిజెపి ఒత్తిడికి ఈవో తలవంచడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు.