జబర్దస్త్ పుణ్యమా అని రష్మి భలే పాపులర్ అయిపోయింది. టాలీవుడ్లో ఉన్న హాట్ యాంకర్లలో అనసూయ తరవాతి స్థానం రష్మీదే. ఈ బ్రాండ్‌తోనే సినిమాల్లో హాట్ హాట్ పాత్రలూ దక్కించుకొంది. ‘గుంటూరు టాకీస్‌లో’ రష్మీ విచ్చలవిడిగాచ నటించేసి – తన ఇమేజ్ ఇంకా ఇంకా పెంచుకొంది. దాంతో రష్మీకి ఆఫర్లు వరుస కట్టాయి. దాంతో పాటు పారితోషికం కూడా భారీగా ముట్టజెప్పాల్సివచ్చింది.
‘నెక్ట్స్ నువ్వే’ సినిమాలోనూ రష్మి ఓ పాత్ర దక్కించుకొంది. ట్రైలర్లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ రష్మీనే. తనతో డబుల్ మీనింగ్ డైలాగుల్ని కూడా పలికించి.. ఆకర్షించే ప్రయత్నం చేశారు. రష్మి వల్ల బీ,సీల్లో టికెట్లు తెగడం ఖాయం అనుకొన్నారంతా. కానీ రష్మీ ఎఫెక్ట్ అంతగా కనిపించ లేదు. బీ,సీల్లో ఈ సినిమా వసూళ్లు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. పైగా.. తెరపై రష్మీ చేసిందేం లేదు. ట్రైలర్లో ఇచ్చిన కిక్… వెండి తెరపై రష్మీ ఇవ్వలేకపోయింది. పైగా… ముదిరిన లక్షణాలు.. లక్షణంగా కనిపించాయి. నటనలోనూ అంతంత మాత్రమే. ఇక మీదట రష్మీ కాల్షీట్ల కోసం కాసులు రాల్చేముందు నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.