విచారణకు సహకరించడం లేదు. నోటీసులు ఇచ్చినా రావడం లేదు కర్నూలులో రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడానికి అడ్డంకులు కల్పించారు. కర్నూలులో ఎస్పీ సహకారం కోరినా కుదర్లేదు. ఆయన చాలా ప్రభావితమైన వ్యక్తి. సీబీఐ అధికారును అడ్డుకోవడానికి చాలా చేశారు.. ఇలా హైకోర్టులో ఎన్ని వాదించినా .. సీబీఐకి ఎదురు దెబ్బే తగిలింది. వివేకా హత్య కేసులో అరెస్ట్ కాకుండా చాలా కాలంగా తప్పించుకుంటున్న అవినాష్ రెడ్డికే ఊరట లభించింది. ఆయనను బుధవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రోజు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం గతంలో హైకోర్టులో వాదనలు జరిగాయి. కానీ న్యాయమూర్తి తీర్పు ఇవ్వలేదు. వేసవి సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని చెప్పారు. ఈ లోపు విచారణకు సీబీఐ నోటీసులు ఇస్తే.. అరెస్ట్ చేస్తారేమో అని ఆయన విచారణకు వెళ్లలేదు. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు.సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ చేయాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం తీర్పు ఇస్తామని ప్రకటించింది. ఈ నాలుగు రోజులు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది.
ఇలా అయితే హైకోర్టు..లేకపోతే సుప్రీంకోర్టు అంటూ తిరుగుతూ ఆయన ఎన్ని పిటిషన్లు వేశారో కానీ..తెలంగాణ హైకోర్టులో మ్యాగ్జిమం ఊరట పొందారు. ఎంత ఆలస్యం చేయాలో అంత ఆలస్యం చేయగలిగారు.కానీ సునీ త పట్టు వీడ కుండా సుప్రీంకోర్టుకు వెళ్లి ఊరటల్ని కొనసాగకుండా చేస్తురున్నారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇస్తున్న తీర్పుల్ని చూసి రెండు సార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి బుధవారం ఎలాంటి తీర్పు వస్తుందో కానీ.. అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా చేస్తున్న ప్రయత్నాల్లో మరో నాలుగు రోజుల ఊరట లభించినట్లయింది.