గత రెండు,మూడు రోజులుగా కొన్ని పత్రికలలో, సోషల్ మీడియా లో ‘దర్శకేంద్రుడు’ కె.రాఘవేంద్ర రావు తి.తి.దే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాది మంది ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె.రాఘవేంద్ర రావు ఖండించారు. ఎస్ వీ బీ సీ ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానల్ లో స్వామివారి పై మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటి ని అలరిస్తూ స్వామివారి సేవ లో తరించాలన్నది ఒకటే తన కోరిక అని ‘దర్శకేంద్రుడు’ కె.రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.