తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో నిర్మించుకుంటున్న ప్రధాన కార్యాలయాన్ని కూల్చేస్తామని ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఆఫీసు కట్టారని.. అలాగే ప్రైవేటు రైతుల స్థలాన్ని ఆక్రమించి ఆ కార్యాలయం కడుతున్నారని… రెవిన్యూ అధికారులు నోటీసులు పంపించారు. దీనికి రెండు రోజుల ముందే.. సాక్షి పత్రికలో.. ” అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం ” అంటూ కథనం రాసింది. దీన్నే ఫిర్యాదుగా తీసుకున్న రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెవిన్యూ అధికారులు పంపిన నోటీసులు చూసి.. టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. పక్కా పత్రాలతో.. ఉన్న తర్వాతే… అన్ని రకాల అనుమతులతో… భవన నిర్మాణం ప్రారంభించామని.. ఇప్పుడు భూమి పేరుతో వివాదాలు తీసుకొచ్చి… టీడీపీ కార్యాలయాన్ని వివాదాస్పదం చేయాలనుకుంటున్నారని… టీడీపీ నేతలంటున్నారు.
వారంలో కూల్చివేయకపోతే.. తామే కూల్చివేస్తామని.. నోటీసులో… తహశీల్దార్.. టీడీపీ ఆఫీసుకు అంటించిన నోటీసులో స్పష్టంగా చెప్పారు. ముందుగా వివరణ అడగడం అధికారుల పని. అందులో ఆక్రమణలు ఉన్నాయో లేదో.. నిర్ధారించుకోవడం… ముందుగా ఎవరైనా చేసిన పని. కానీ.. సాక్షి పత్రికలో కథనం వచ్చిందని… అధికారులు నోటీసులు జారీ చేయడం ఏమిటన్న చర్చ … టీడీపీలో నడుస్తోంది. ఎలాంటి వివాదాల్లేని భూమిలో.. అన్ని అనుమతులతో నిర్మిస్తున్నప్పటికీ.. కేవలం వివాదాస్పదం చేయడానికి ప్రభుత్వం .. అధికారదుర్వినియోగం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టుకు వెళితే.. మొట్టికాయలు పడినా సరే.. టీడీపీ కార్యాలయాన్ని కూలగొట్టామనే సంతృప్తి కోసం… ఇలాంటి పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకోవాలనున్న టీడీపీ మంగళగిరి సమీపంలో 4.51 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ లో నిర్మాణం ప్రారంభించారు. మరో నెలలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మూడు భవన సముదాయలతో కొత్త కార్యాలయం నిర్మించారు. సరైన కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే… సమస్యలు ఉండవనుకుంటున్న టీడీపీ నేతలకు… ఆ భవనాన్ని కూలగొట్టి షాక్ ఇచ్చేందుకు… సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు.