బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చిన వారందరికీ నోటీసులు ఇచ్చారు. టాలీవుడ్ నటి హేమ కూడా డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో ఆమెకూ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10గంటలకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, అశీరాయ్, కాంతి, రాజశేఖర్, సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
మొన్నటి వరకు ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించి హేమ అడ్డంగా బుక్కైంది. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలడంతో సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొనడటంతో విచారణ సందర్భంగా హేమ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.