సస్పెన్షన్లో ఉన్న దేవాదాయ శాఖ శాఖ కమిషనర్ శాంతి ప్రెస్మీట్ పెట్టి చేసిన ప్రకటనలు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉండటంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేశారు. మీడియా సమావేశంలో చేసిన అనేక ప్రకటనలకు.. ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి పొంతన లేదు.
ప్రసూతి సెలవు దరఖాస్తులో భర్త పేరు మదన్ మోహన్
ఎప్పుడో 2016లో మదన్ మోహన్ కు విడాకులిచ్చానని 2020లో లాయర్ సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాననని శాంతి మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ ఆమె ఉద్యోగంలో చేరిన 2020లో తనభర్త మదన్ మోహన్ అని ప్రభుత్వానికి చెప్పారు. గత ఏడాది ప్రసూతి సెలవులకు వెళ్లినప్పుడు కూడా చేసిన దరఖాస్తులో తన భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పారు. కానీ ప్రెస్మీట్లో మాత్ర భిన్నంగా చెప్పారు. ఇలా ఓ పెళ్లితో విడాకులు కాకుడానే మరో పెళ్లి చేసుకోవడం నేరం. సర్వీసు నిబంధనలకు విరుద్ధం. దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.
Read Also : డీఎన్ఏ గురించి అడిగితే.. ఎన్డీఏపై పడ్డ విజయసాయి!
అనుమతి లేకుండా ప్రెస్ మీట్
శాంతి ప్రభుత్వ ఉద్యోగి. ఆమె మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ విషయంలో శాంతి ఎలాంటి అనుమతి తీసుకోలేదని దేవాదాయ శాఖ కమిషనర్ స్పష్టం చేశరు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించారని చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలన్నారు.
మరికొన్ని కీలక అభియోగాలు
శాంతి వ్యవహారం మొతటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఓ అధికారిపై ఇసుక చల్లడం దగ్గర నుంచి నివాసం ఉండే అపార్టులో తోటి వారితో గొడవపడటం వరకూచాలా ఉన్నాయి. ఓ కేసు కూడా నమోదయింది. అధికారం లేకపోయినా ఇచ్చిన దేవాదాయ శాఖల భూముల లీజులు, దుకాణాల లీజుల వ్యవహారంలోనూ అవినీతిపై నోటీసులు ఇచ్చారు.
శాంతి ఉద్యోగంలోకి ఎంపికైనా విధానంపైనా అనుమానాలు ఉండటంతో ప్రభుత్వం అంతర్గత పరిశీలన జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎలా ఆమెకు ఉద్యోగం వచ్చిందో బయటకు తీస్తున్నారు. మొదట జారీ చేసిన నోటీసులకే శాంతి సమాధానం ఇవ్వలేదు. రెడోసారి జారీచేసిన నోటీసులకూ సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.