పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, ఆయన భార్య జయసుధ మచిలీపట్నంలో కనిపించి చాలా రోజులు అయింది. తాము కొట్టేసిన బియ్యం విషయంలో కేసులు నమోదు కావడంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మధ్యలో పేర్ని నాని ఓ రోజు వచ్చి మళ్లీ కనిపించకుండా పోయారు. తాజాగా అధికారులు తమ ఎదుట హాజరవ్వాలని వివరణ ఇచ్చారు. పౌరసఫరాల అధికారి కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణకు పిలిచారు.
పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులకు.. తలుపులకు తాళాలు వేసి ఉండటం కనిపించంది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
అరెస్టు భయంతో భార్యను తీసుకుని పేర్ని నాని బెంగళూరు వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా ఆజ్ఞాతంలోనే ఉన్నారు. మాట కంటే ముందు పరుగున వచ్చి ప్రెస్మీట్లు పెట్టి .. అబ్బా.. నిజమా అని అనిపించే లాజిక్కులు లాగే పేర్ని నాని తన గోడౌన్లలో బియ్యం కొట్టేసి..డబ్బులు కట్టేసి కూడా పారిపోవడం మాత్రం ఆయన అనుచరులకు కాస్త ఇబ్బందిగానే ఉంది