కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చును. అయితే ఇంతవరకు వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ తప్ప ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ తమ అభ్యర్ధి పేర్లను ఖరారు చేసుకోలేకపోయాయి. తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధి పేరు ఖరారు చేసేందుకు నేడు డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించబోతున్నారు. కనుక రేపటిలోగా కాంగ్రెస్ తన అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం ఉంది. అధికార తెరాస ఎవరిని బరిలోకి దింపితే ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాదిస్తామని ఇంకా లెక్కలు కట్టుకొంటోంది. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని తెదేపా నిశ్చయించుకొంది. కనుక బీజేపీ తన అభ్యర్ధి పేరును నేడోరేపో ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 4వ తేదీ వరకు ఉంది.