చంద్రబాబు పెట్టుకున్న ఫిట్నెస్ ట్రాకర్‌ను అద్భుత మహిమ గల ఉంగరం అంటూ కొన్ని “అతి మీడియా”లు చేసిన రచ్చ ఇంకా సోషల్ మీడియాలో రగులుతూనే ఉంది. తాజాగా సీఎం కేసీఆర్ వేలికి పెట్టుకున్న ఉంగరం నుంచి చర్చ ప్రారంభమయింది. కేసీఆర్.. తన కుడి చేతికి ఎప్పుడు ఓ ఉంగరాన్ని ధరిస్తుంటారు. అయితే ఇన్నాళ్లూ ఎరుపు రంగు స్టోన్ కలిగిన రింగ్ ధరించిన కేసీఆర్.. తాజాగా ఆకుపచ్చ రంగు స్టోన్ కలిగిన ఉంగరంతో కనిపిస్తున్నారు. దీన్ని కొంత మంది హైలెట్ చేస్తున్నారు.
న్యూమరాలజీ ప్రకారం ఎరుపు రంగు ఆరోగ్యం కోసం ధరిస్తే, గ్రీన్ కలర్ స్టోన్ ధరించడం వల్ల పదోన్నతి సాధిస్తారనే నమ్మకాలు ఉన్నాయి. జీవితంలో తన దశ బాగోలేదు అనుకున్న సందర్భంలో, తాను కోరుకున్నది సాధించాలన్నప్పుడు ఆకు పచ్చ రంగు కలిగిన ఉంగరాన్ని ధరిస్తారని చెబుతుంటారు. కేసీఆర్ అదే కారణంగా ఉంగరం మార్చారని చర్చ ప్రారంభించారు. నిజానికి కేసీఆర్‌కు ఈ నమ్మకాలు ఉన్నాయి. గ్రహబలాన్ని, మూహుర్తాలను పక్కాగా చూసుకునే సీఎం కేసీఆర్.. తాజాగా తన చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా అదే కోణంలో మార్చారని భావిస్తున్నారు.
వాస్తు దోషం ఉందనే కారణంతోనే సచివాలయానికి రావడం లేదని, దాని స్థానంలో తనకు కలిసి వచ్చేలా నూతన భవనాన్ని నిర్మిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూంటాయి సందర్భం వచ్చిన ప్రతిసారి దెబ్బిపొడుస్తూనే ఉన్నాయి. తాజాగా తన చేతికి ఉన్న ఉంగాన్ని మార్చడంతో వాస్తు, జోతిష్యం తదితరాల పైన నమ్మకాల్లో భాగమేనని అంటున్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత మీద అసువుగా కథలు అల్లేసిన మీడియా.. కేసీఆర్ ఉంగరం మీద మాత్రం నోరు మెదపలేకపోతోంది. నిజంగా సెంటిమెంట్ కోసం మార్చుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి.