కథల విషయంలో ఆచి తూచి స్పందిస్తుంటాడు గోపీచంద్. తన జడ్జిమెంట్‌పై జనాలకు గురి ఎక్కువే. అదే మరోసారి రుజువైంది. తాను ‘నో’ చెప్పడం వల్ల ఓ ఫ్లాప్ నుంచి తప్పించుకొన్నాడు. సుశాంత్ కథానాయకుడిగా నటించిన ‘ఆటాడుకుందాం రా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. కథలో కొత్తదనం లేదని, వినోదంలో పస లేదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. దాంతో సుశాంత్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయినట్టైంది. నిజానికి ఈ ఫ్లాపు గోపీచంద్‌కి తగలాల్సింది. ఎందుకంటే ఈ కథ ముందు గోపీచంద్ దగ్గరకే వెళ్లింది.
లౌక్యం తరవాత శ్రీధర్ సిపాన కు దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వాలని గోపీచంద్ డిసైడ్ అయ్యాడు. భవ్య ఆర్ట్స్ సంస్థ శ్రీధర్‌కి అడ్వాన్సు కూడా ఇచ్చింది. కొంతకాలం ఇదే స్క్రిప్టుతో గోపీచంద్ వెంట తిరిగాడు శ్రీధర్. అయితే… ఎందుకనో ఈ కథని గోపీచంద్ పక్కన పెట్టాడు. ‘నాకోసం మరో కథ చెప్పు.. అప్పుడు చేద్దాం’ అన్నాడట. లేదంటే ఈకథని మరో హీరోతో భవ్య ఆర్ట్స్ లోనే చేసుకో అని ఆఫర్ ఇచ్చాడట. ఆ కథ అటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ దగ్గర చేరింది. ఈ చిత్రానికి ముందు అనుకొన్న దర్శకుడు శ్రీధరే. అయితే జి.నాగేశ్వరెడ్డితో సుశాంత్‌కి కమిట్మెంట్స్ ఉండడం వల్ల.. డైరెక్షన్ ఛాన్స్ మిస్సయ్యింది. ఈ కథకు నో చెప్పి గోపీచంద్ మంచి పనే చేశాడు.