పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో ప్రతిపక్ష నేత అంటే ఆషామాషీ కాదు. కొన్ని పవర్స్ఉంటాయి. కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందడమే కాదు ఈసి, సీబీఐ, ఈడటీ వంటి సంస్థలకు చీఫ్‌లను నియామకంలోనూ రాహుల్ కీలక భూమిక పోషించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీలో రాహుల్ గాంధీ ఒకరిగా ఉంటారు. ప్రతిపక్ష నేతగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్, కొన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు.
వాస్తవానికి 1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. అలాగే వేతనంగా రూ.3.3 లక్షలు, జడ్ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్ బిల్డింగ్‌లో ఆయనకో కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.
2014, 2019 ఎన్నికల్లో మొత్తం సీట్లలో 10 శాతం కాంగ్రెస్ కు రాలేదు. పదేళ్లుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో రాహుల్‌కు ఆ హౌదా దక్కింది. గతంలో ప్రధానప్రతిపక్షనేత హోదా లేకపోవడంతో ఫ్లోర్ లీడర్లుగా ఇతర నేతలు వ్యవహరించారు. అధిర్ రంజన్ చౌదరి, మల్లిఖార్జున్ ఖర్గే వంటి వారు వ్యవహరించారు. ఈ సారి రాహులే ఆ బాధ్యత తీసుకున్నారు.