పవన్ కల్యాణ్ పార్టీ `జనసేన`కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబు, వరుణ్ తేజ్ కలసి రూ.1.25 కోట్లు అందించారు. నిజంగా ఇది పెద్ద మొత్తమే. టాలీవుడ్లో మరికొంత మంది పవన్‌కి విరాళాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. చిరంజీవి, చరణ్, బన్నీలు ఎవరూ ఊహించనంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరు జనసేనలో చేరతారని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీలో చేరాలనుకుంటే దానికంటే ముందు విరాళాల ఘట్టం ముగిసే అవకాశం ఉంది.
మరీ ముఖ్యంగా వపన్ కల్యాణ్ భక్తులు అనబడే నితిన్, నిఖిల్ లాంటి వాళ్లు… షకలక శంకర్ లాంటి చిన్న సైజు నటీనటులు కొంతమంది తమ పరిధిలో విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. నితిన్ నుంచి పెద్ద మొత్తమే వెళ్లబోతోందట. సంక్రాంతి లోగా ఈ విరాళాల్ని పవన్‌కి స్వయంగా అందించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా సినీ రంగం స్పందించలేదు. కుటుంబం నుంచి గానీ, ఇతర కథానాయకులు నిర్మాతల నుంచి గానీ ఎలాంటి విరాళాలూ రాలేదు. ఈ విషయంలో ప్రజారాజ్యం కంటే జనసేనకే ఎక్కువ మార్కులు పడినట్టు.