హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో..రేట్ల పెరుగుదలలో ఎన్నారైల పాత్ర కీలకంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణం అవుతున్న బడా లగ్జరీ ప్రాజెక్టుల్లో దాదాపుగా నలభై శాతం కొనుగోళ్లు ఎన్నారైలు చేస్తున్నారు. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు. నమ్మకమైన, డబ్బుకు గ్యారంటీ, ఇంటి విలువ పెరగడం దగ్గర , రిటర్న్స్ ఇలా అన్నీ చూసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ చుట్టుపక్కన ప్రాజెక్టుల్లో ఈ ఇన్వెస్ట్ మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్లో లగ్జరీ ఇళ్ల డిమాండ్ ను మించి నిర్మిస్తున్నారు. కొనుగోలు దారులు ఎవరా అని ఆశ్చర్యపోతూంటారు. ఇప్పుడు చాలా మందికి కొనుగోలు దారులు బయట నుంచివస్తున్నారని క్లారిటీ వస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలే కాదు .. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రవాస భారతీయులు కూడా హైదరాబాద్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీలో సిగ్నేచర్ లాంటి నిర్మాణాలు, మంచి నిర్వహణ.. అంతకు మించి హైదరాబాద్ కు ఉన్న భవిష్యత్ అవకాశాల కారణంగా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఎన్నారైలను ఆకర్షించేందుకు ప్రత్యేక సేల్స్ టీముల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆసక్తి చూపించిన వారిని వదిలి పెట్టకుండా ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్లో నే కాదు ఎక్కడైనా ఎన్నారైల పెట్టుబడులు ఇరవై శాతం వరకూ ఉంటాయని అనుకుంటారు.. కానీ అది హైదరాబాద్లోని మాత్రం రెట్టింపు.