టీడీపీ అధినేత చంద్రబాబుకు NSG సెక్యూరిటీని తొలగించే అవకాశం ఉంది. ఈ మేరకు విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది . నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసిన ఉద్దేశం వీవీఐపీలకు సెక్యూరిటీ కల్పించడం కాదని… ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఉన్నతమైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన వారిని సెక్యూరిటీగా వినియోగించడం ఆపేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వచ్చే ఏడాదిలోగా వీవీఐపీ సెక్యూరిటీ వింగ్ ను NSG నుంచి తొలగిస్తున్నారు.
ప్రస్తుతం 9 మందికి మాత్రమే NSG సెక్యూరిటీ ఉంది. అందులో చంద్రబాబు ఒకరు. సిట్టింగ్ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ తో పాటు రాజ్ నాథ్ సింగ్, మాయవతి , ఎల్ కే అద్వానీ, ఫరూక్ అబ్దుల్లా, శర్వానంద సోనోవాల్, గులాం నబీ ఆజాద్‌లకు ఈ సెక్యరిటీ ఉంది. వీరిలో మాయావతి, ఆజాద్, అద్వానీ, సోనోవాల్ యాక్టివ్ గా లేరు. చంద్రబాబు, ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్ మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కారణం కేంద్రం మిగిలిన వారికి తీయించి ఈ ముగ్గురికి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు.
దక్షిణాదిలో NSG సెక్యూరిటీ ఉన్న ఒకే ఒక్క నేత చంద్రబాబు. ఆయనకు ముప్పు ఎక్కువగా ఉండటంతో గత ఏడాది NSG కమెండోలను రెట్టింపు చేశారు. గతంలో సోనియా కుటుంబానికి SPG భద్రత ఉండేది. ప్రధానికి మాత్రమ SPG భద్రత ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రధాని కాకుండా ఇక ఎవరికైనా CRPF రక్షణ మాత్రమే ఉంటుందని… వారు కూడా ఎన్ఎస్జీ స్థాయిలో శిక్ష పొందిన కమెండోలేనని కేంద్రవర్గాలు చెబుతున్నాయి.