ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త సినిమా కొబ్బరికాయ కొట్టేసుకొంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయం లో లాంఛనంగా ప్రారంభమైంది. రాశీఖన్నా కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టెక్నికల్ పరంగానూ ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. సంగీత బాధ్యతలు దేవిశ్రీ కి అప్పగించారు. సి. కె. మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా ఓ టెక్నీషన్ని దించిన సంగతి తెలిసిందే. ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ యేడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
వాళ్ల ఫోకస్ అంతా.. దసరాపై ఉందని టాక్. విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని, అందుకోసం పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ షెడ్యూల్‌ని సెట్ చేశారని తెలుస్తోంది. మరో ఇద్దరు కథానాయికల్ని ఇంకా ఎంపిక చేయాల్సివుంది. ఈనెల 15 నుంచి రాశీఖన్నా, ఎన్టీఆర్‌లపై సీన్లు తెరకెక్కిస్తారట. ఆ తరవాత ఎన్టీఆర్ సోలో సీన్స్‌నీ… యాక్షన్ పార్ట్‌నీ తెరకెక్కిస్తారని ఇవన్నీ పూర్తయ్యేకే మిగిలిన ఇద్దరు కథానాయికలూ సెట్లోకి అడుగుపెడతారని తెలుస్తోంది.