ట్రిపులార్ కోసం మూడేళ్ళు లాక్ అయిపోయాడు ఎన్టీఆర్. ఇప్పుడా గ్యాప్ ని ఫిల్ చేసే కార్యచరణ సిద్దం చేశాడు. కొరటాల- ఎన్టీఆర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది. ఈ సినిమాకోసం ఎన్టీఆర్ కేవలం 70రోజుల మాత్రమే కేటాయించాడు. సినిమా ఎన్ని రోజులు షూట్ జరుపుకున్నా తన పార్ట్ వరకూ కేవలం 70రోజులు మాత్రమే కేటాయించాడు. ఈ డెడ్ లైన్ కి కొరటాల కూడా అంగీకరించాడు.
నిజానికి కొరటాలకి కూడా త్వరగా సినిమాలు చేయాలని వుంది. భరత్ అనే నేను తర్వాత కొరటాల నుంచి సినిమా రాలేదు. ఒక పెద్ద దర్శకుడికి ఇది చాలా పెద్ద గ్యాప్. ఇంత గ్యాప్ వుండటం మంచిది కాదని కొరటాల కూడా భావిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ పూర్తయింది. ఆచార్య విడుదలైన వెంటనే ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. కొరటాల తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకి కూడా లిమిటెడ్ కాల్షిట్లే కేటాయించాడు ఎన్టీఆర్. మొత్తానికి ఆర్ఆర్ఆర్ గ్యాప్ ని భర్తీ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.