`ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నేను కాదు.. నా దేశం మొత్తం నడుస్తుంది. వాళ్లందరినీ నా గుండెల్లో మోసుకొంటూ నడుస్తా` అని ఎన్టీఆర్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ చెప్పినట్టే… చేశాడు. రెడ్ కార్పేట్ పై నడిచేటప్పుడు భారతీయత చాటేలా చేశాడు. ఆస్కార్ వేడుకల్లో ఎన్టీఆర్ నల్లని సూటు వేసుకొని దర్శనమిచ్చాడు. సూటుపై… టైగర్ బొమ్మ మెరిసిపోతూ కనిపించింది. ఎన్టీఆర్‌ని ‘యంగ్ టైగర్’ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ని `ఆర్.ఆర్.ఆర్`లో ఓ పులిలా చూపించాడు రాజమౌళి. అయితే.. ఈ పులి బొమ్మ ఉన్న సూటు ఏమిటని? ఆస్కార్ నిర్వాహకులు అడిగితే.. ఎన్టీఆర్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా..? ”పులి.. మా జాతీయ జంతువు. అందుకే.. ఆ బొమ్మ కనిపించేలా సూట్ వేసుకొన్నా” అని సమాధానం చెప్పాడు. అలా.. దేశం మొత్తాన్ని ఎన్టీఆర్ రిప్రజెంట్ చేసినట్టు అయ్యింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ మరోసారి రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. ”లాస్ ఏంజెల్స్‌కి చాలాసార్లు వచ్చా. కానీ అప్పుడు హాలీడే స్పాట్. ఇప్పుడు వర్క్ ప్లేస్ అయిపోయింది. ఆర్.ఆర్.ఆర్ వల్ల సాధ్యమైన మ్యాజిక్ ఇది. రాజమౌళి గొప్ప మేధావి. తను త్వరలో హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తాడు. అంత సత్తా తనకుంది” అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.