కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ఈనెల 14న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చిన ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లకు ఇంకాస్త ఊతం ఇచ్చాడు. ఈ సినిమాని ఆశీర్వదిస్తూ, తన అన్న కల్యాణ్ రామ్‌కి ఓ మంచి విజయం దక్కాలని కోరుకున్నాడు. ”అన్న మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. అన్నయ్యను అలా చూస్తుంటే నాన్నకు ప్రేమతో రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు కూడా నేనూ ఇలానే టెన్షన్ పడ్డాను. స్టీరియో టైపు పాత్రలు చేసుకుంటూ వెళ్తే సక్సెస్‌లు రావొచ్చు. కానీ సంతృప్తి ఉండదు. అరె మా హీరో భలే చేశాడ్రా అని అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవాలి. అదే ముఖ్యం. కొత్త పాత్రలు చేస్తున్నప్పుడు ఇలా ఒత్తిడికి గురవ్వడం మామూలే. మరేం ఫర్వాలేదు. తెలుగు ప్రేక్షకులది చాలా మంచి హృదయం. నిజాయతీతో చేసిన ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారు. మా అన్నయ్యపై నమ్మకంతో ఇదివరకెప్పుడూ చూడని పాత్రలో ఆయన్ని తీర్చిదిద్దారు జయేంద్ర. సంగీత దర్శకుడు శరత్ గురించి చాలా విన్నా. ఆయన్ని మొదటిసారి చూస్తున్నా. చాలా మంచి పాటలు ఇచ్చారు. పీసీ శ్రీరామ్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా మా అన్నయ్య కెరీర్లో ఓ మైల్ స్టోన్‌గా మిగిలిపోవాల”న్నారు.