నిమ్మకూరులో ఈనెల 21న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పాటల వేడుక నిర్వహిద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు నిమ్మకూరు ఆలోచనని బాలకృష్ణ పక్కన పెట్టారు. దాదాపుగా హైదరాబాద్ లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు. ఆ ప్రాంతంతో నందమూరి ఫ్యామిలీకి మంచి ఎటాచ్మెంట్ ఉంది. అందుకే బాలయ్య నిమ్మకూరు ఎంపిక చేశాడు. అయితే.. వేదిక సడన్గా మారింది. దానికి కారణం… అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని చిత్రబృందం చెబుతోంది. కానీ అసలు కారణం మరోటి ఉంది.
బాలయ్యకు జాతకాలు, ముహూర్తాలపై గట్టి నమ్మకం. ఆ కారణంగానే… ఆడియో వేదిక మారిందని సమాచారం. స్థలబలం ప్రకారం.. నిమ్మకూరులో ఆడియో వేడిక నిర్వహిస్తే అచ్చిరాదని జ్యోతిష్యులు సలహా ఇచ్చారట. అందుకనే…. ఆడియో వేదిక మారిందని తెలుస్తోంది. ”అయితే నిమ్మకూరులో, లేదంటే హైదరాబాద్ లో వేడుక నిర్వహిస్తాం. ఆదివారం సాయింత్రం నాటికి వేదిక ఖరారు చేస్తామ”ని చిత్రబృందం తెలిపింది.