విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని ప్రకటించి అన్ని వర్గాల్లో ఆసక్తిరేపారు ఎన్టీఆర్ తనయుడు, హీరో, అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను త్వరలోనే సినిమాగా తెరకెక్కిస్తామని, సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా మహోన్నత వ్యక్తిగా పేరొందిన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో తెరకెక్కించే చిత్రంలో తానే కథానాయకుడిగా నటించనున్నట్టు కూడా వెల్లడించారు బాలయ్య.
ఈ ప్రకటన ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే మాటలు కాదు. తెలుగు సినీ చరిత్రలో ఓ లెజెండ్ ఎన్టీఆర్. అలాగే రాజాకీయాల్లో ఓ ప్రభంజం. అటు వ్యక్తిగతంగా కూడా ఎంతో విలక్షణం. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. చివరి దశలో వెన్నపోట్లు కూడా తిన్నారు. అలాంటి ఎన్టీఆర్ జీవితం తెరపై తీసుకురావడం అంటే సర్వత్ర ఆసక్తికరం.
అయితే తాజగా బాలయ్య వేసిన స్టెప్ చూస్తుంటే.. ఎన్టీఆర్ బయోపిక్ పై మరీ అంత ఎక్సయిట్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి, వియ్యంకుడు నారా చంద్రబాబును కలిశారు బాలయ్య. అల్లుడు లోకేష్ కూడా వున్నారు. ఈ సందర్భంగా బయోపిక్ గురించి చంద్రబాబుకు చెప్పారు బాలయ్య. చంద్రబాబు సలహాలు సూచనలు మేరకే ఈ బయోపిక్ తయారుచేస్తారట బాలయ్య. చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎలా వుటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంక ఎన్టీఆర్ బయోపిక్ చూసినట్లే.!