ఈనెల 21న నిమ్మకూరులో జరగాల్సిన `ఎన్టీఆర్` ఆడియో వేడుక… హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులెవరన్న విషయంలో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఈ ఆడియో కార్యక్రమాన్ని ‘నందమూరి’ కుటుంబ కార్యక్రమంగా మార్చాడట బాలయ్య. నందమూరి కుటుంబానికి సంబంధించిన కీలకమైన సభ్యులంతా వేదికపై కనిపిస్తారని సమాచారం. అయితే.. ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందలేదని, ఎన్టీఆర్‌ని ఆహ్వానించే విషయంలో బాలయ్య ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉన్న అలనాటి నటీనటుల్ని, నిర్మాతల్నీ, దర్శకుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని బాలయ్య భావిస్తున్నారు. కైకాల సత్యనారాయణ, రమేష్ ప్రసాద్, శారద, జమున.. ఇలా కొంతమంది దిగ్గజాలకు ఆహ్వానాలు అందాయని సమాచారం. కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.