ఎన్టీఆర్ జీవితకథతో సినిమా అనగానే చాలా మంది ఎక్సైట్ అయిపోతున్నారు. సినిమాల్లోకి రావడం, నంబర్ ఒన్ హీరోగా ఎదగడం, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేంత కీర్తి సంపాదించడం, రాజకీయ పార్టీ స్థాపించి….చాలా తక్కువ కాలంలోనే…ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి విషయాల్లో ఇష్యూసే లేవు. జరిగిన విషయాలను అంతే గొప్పగా చిత్రీకరించవచ్చు. కానీ ఎన్టీఆర్ జీవిత చరమాంకం ఎపిసోడ్ విషయంలోనే సమస్యలు వస్తాయి. ఎన్టీఆర్ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ కూడా.
కానీ ఈ విషయంలో మరీ ఎక్సైట్ అవ్వాల్సినంత సీన్ లేదని టిడిపి వర్గాల ద్వారా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తాను ఇచ్చిన అలవికాని హామీలతోపాటు మోడీ వేవ్, పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఈ సానుకూల అంశాలు ఏవీ ఉండవు. పైగా మోడీ, పవన్‌లతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆల్రెడీ పవన్ చెప్పేశాడు. ఇక 2019 ఎన్నికలలో బిజెపి-టిడిపిలు కలిసి పోటీ చేసే ఛాన్సేలేదని పరిశీలకులు చెప్తున్నారు. టిడిపి నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో అదే విషయాన్ని చెప్తున్నారు. సో…2014లో కలిసొచ్చిన బలాలన్నీ ఈసారి బలహీనతలుగా మారడం ఖాయమే. పైగా ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితి. మోడీ హ్యాండ్ ఇవ్వడంతో కేంద్రం నుంచి కూడా తోడ్పాటు లేని దుస్థితి. ఆ విధంగా చూసుకుంటే 2019ఎన్నికల సమయానికి చంద్రబాబు చేయబోయే అద్భుతాలు కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఈ సారి ఎన్నికలలో 2014 ఎన్నికలను మించిన భారీ హామీలను ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే తన స్ట్రెంగ్త్‌ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీకి ‘గాంధీ’ అన్న తోకలాగా, టిడిపికి ఎన్టీఆర్‌ని మించిన బలం ఇంకేముంటుంది. చంద్రబాబే చెప్పుకుంటున్నట్టుగా……చంద్రబాబు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లీడర్ అయితే కావొచ్చేమో కానీ గ్రామ సీమల్లో ఓట్ల వర్షం కురవాలంటే మాత్రం ఎన్టీఆర్ బొమ్మ తప్పనిసరి. ఈ సారి 2019 ఎన్నికల సమయానికి ఆ ఎన్టీఆర్ బొమ్మను 70ఎంఎంలో చూపించాలన్నదే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్లానింగ్ వెనుక ఉన్న టార్గెట్. ‘పుణ్యభూమి నా దేశం’ సాంగ్ ఒక్కటే ఎన్నికల రణరంగంలో ఎన్టీఆర్ గెలవడానికి చాలా హెల్పయ్యింది. మరిక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చంద్రబాబుకు ఏ రేంజ్లో హెల్ప్ అవుతుందో చూడాలి.