తీస్తారో లేదో, ఎప్పుడు వస్తుందో, ఎవరు డైరెక్ట్ చేస్తారో క్లారిటీ లేదు గానీ… ఎన్టీఆర్బయోపిక్ మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా చలామణీ అవుతోంది. ఎప్పుడైతే బాలయ్య నోటి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ గురించి వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచీ… అదో సంచలనం అయ్యింది. ఎన్టీఆర్ గురించి అందులో ఏం చెబుతారు? చంద్రబాబుని ఎలా చూపిస్తారు? ఎన్టీఆర్ జీవిత కథ మొత్తం చెబుతారా, లేదంటే అందులో ఉన్న నిజాల్ని దాచేస్తారా? అనే ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో రేకెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ రాసుకొంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించాలని, అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరిచేలా స్క్రిప్టు తయారు చేసుకోవాలని బాలయ్యకు రకరకాల సలహాలూ, సూచనలు ఇస్తున్నారంతా. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ స్ర్కిప్టు ఎప్పుడో రెడీ అయిపోయిందట. డైలాగ్ వెర్షన్ తో సహా బౌండెడ్ స్ర్కిప్టు బాలయ్య చేతిలో ఉందట. ఇక సెట్స్‌కి వెళ్లడమే ఆలస్యం అని సమాచారం.
మూడేళ్ల క్రితమే… బాలయ్య ఈ కథని రెడీ చేయించారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం. ఇండ్రస్ట్రీతో చాలా దగ్గర సంబంధాలున్న ఓ వ్యాపారవేత్త అధ్వర్యంలో ఎన్టీఆర్ బయోపిక్ స్ర్కిప్టు రెడీ అయ్యిందని, అదంతా బాలయ్య డైరెక్షన్లోనే జరిగిందని, బాలయ్య సూచనల మేరకే.. అందులో సన్నివేశాల్ని పొందు పరిచారని సమాచారం. బాలయ్య వందో సినిమా చేయాలనుకొన్నప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా చర్చకు వచ్చిందట. అయితే.. వందో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయని, బయెపిక్ అనగానే అవింకా పెరిగిపోతాయని బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్టు టాక్. 102వ సినిమాగా ఎన్టీఆర్ బయోపిక్ సెట్ప్పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈలోగా చిన్న చిన్న మార్పులు చేసుకొంటూ వెళ్తారు. బాలయ్య మూడ్ బాగుండి, 101వ సినిమాకి తగిన కథ దొరక్కపోతే.. అప్పుడు ఎన్టీఆర్ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకొన్నాడో బాలయ్య డిసైడ్ అయిపోయాడు. చంద్రబాబు సూచనలు తీసుకోవాలా, విమర్శలు పట్టించుకోవాలా అన్న బెంగలు, భయాలూ లేవు. ఇక ఎవరు చెప్పినా, ఈ సినిమాపై ఎన్ని వివాదాలు రేగినా వినడు. స్ర్కిప్టులో ఏముందో అది తీసుకొంటూ వెళ్లడమే.