బాహుబలి 2లో బొద్దుగా ఉన్న అనుష్క సైతం చాలా స్లిమ్‌గా కనిపించింది. అదంతా సీజీ ఎఫెక్ట్స్ పుణ్యమే. సాంకేతికతని ఉపయోగిస్తూ… లావుగా ఉన్నవాళ్లని సైతం స్లిమ్‌గా ఎలా చూపించొచ్చో.. `బాహుబలి 2`లోని అనుష్కని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి ఎఫెక్టే `ఎన్టీఆర్` కోసం వాడబోతున్నట్టు సమాచారం. బాలయ్య ఈమధ్య మరీ బొద్దుగా కనిపిస్తున్నాడు. అన్న ఎన్టీఆర్… అప్పట్లో స్లిమ్‌గానే ఉండేవారు. వయసు మీద పడుతున్న కొద్దీ.. లావెక్కారు. యవ్వనంలోనూ, ఆ తరవాతి దశలోనూ ఉన్న ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యని చూపించాల్సివచ్చినప్పుడు ఈ ఎఫెక్ట్స్‌ని వాడబోతున్నట్టు సమాచారం. నిజానికి యవ్వన దశలో ఉన్న ఎన్టీఆర్‌గా శర్వానంద్‌ని చూపిద్దామనుకున్నారు. కానీ నందమూరి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న అనుమానంతో, ఆ పాత్రనీ బాలయ్యతోనే వేయించాలని డిసైడ్ అయ్యారు. అయితే… ఇప్పుడున్నలగా బాలయ్య తెరపై కనిపిస్తే.. నప్పదు. బరువు తగ్గాలని బాలయ్య భావించినా… అందుకు తగిన కసరత్తులు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అందుకే.. ఈ ఎఫెక్ట్స్‌ని వాడుకోవాలని భావిస్తున్నారు.