ఎన్టీఆర్ – కె.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ జోడీ. ఈ కాంబినేషన్లో 11 సినిమాలొచ్చాయి. అందులో సగం సూపర్ డూపర్ హిట్. అడవి రాముడు, డ్రైవర్ రాముడు,యమగోల లాంటి గొప్ప కమర్షియల్ సినిమాలున్నాయి. ఎన్టీఆర్ కథ చెబుతూ.. రాఘవేంద్రరావుని చూపించకపోతే ఎలా? ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దర్శకేంద్రుడు కూడా ఉన్నారు. ఆ పాత్రలో రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ నటించారు. ప్రకాష్ దర్శకుడే అయినా… నటుడిగా తన ప్రయాణం మొదలైంది. ‘నీతో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరవాత దర్శకత్వం వైపు మళ్లారు. ఇంత కాలానికి.. మళ్లీ కెమెరా ముందుకు రావడం, అందులోనూ తండ్రి పాత్ర పోషించడం విశేషమే. ‘అడవి రాముడు’ సెట్లో ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేస్తూ… ప్రకాష్ కనిపిస్తాడని సమాచారం. అన్నట్టు.. ఈసినిమాలో దాసరి నారాయణరావుగా చంద్రసిద్దార్థ్ నటిస్తున్నారు. ఆయన గెటప్.. అచ్చం దాసరిలానే ఉండబోతోందట. మరి దర్శకేంద్రుడిగా, ప్రకాష్ ఎలా సూటయ్యాడో చూడాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.