2016వ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన ఇద్దరు హీరోలు బన్నీ, ఎన్టీఆర్. సర్దార్, బ్రహ్మోత్సవంలాంటి డిజాస్టర్స్‌తో డీలాపడిన మార్కెట్‌కి ఎనర్జీ ఇచ్చింది ఎన్టీఆర్, బన్నీలే. అయితే సక్సెస్‌తో పాటు ఎన్టీఆర్, బన్నీలకు ఓ మంచి లెస్సన్ కూడా నేర్పిన సంవత్సరంగా 2016ను చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడంతో ఆ ఇద్దరి కెరీర్లో కూడా ఎప్పుడూ లేనంత గ్యాప్ వచ్చింది. సరైనోడు సినిమా తర్వాత బన్నీ సినిమా తెరకెక్కడానికి నెలల టైం పట్టింది. అది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో అనుకున్న సినిమాలేవీ సెట్ అవ్వక హరీష్ శంకర్‌తో కమిట్ అవ్వాల్సి వచ్చింది. అన్నీ కరెక్ట్‌గా కుదిరి ఉంటే ఈ పాటికి సరైనోడు తర్వాత సినిమా కూడా రిలీజ్ అయి ఉండేది. ఇక ఎన్టీఆర్ కథ కూడా సేం టు సేం. జనతా గ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన తర్వాత ఏ సినిమా చేయాలి? ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలి అనే విషయంలో పూర్తి కన్ఫ్యూషన్లో పడిపోయాడు ఎన్టీఆర్. లింగుస్వామి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్స్‌తో సినిమా చేయాలని అనుకున్న ప్లాన్స్ ఏవీ వర్కవుట్ అవ్వలేదు. చాలా మంది పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఫైనల్‌గా సర్దార్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు ఎన్టీఆర్.
సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ పోవాలి, సినిమా సినిమాకు స్టార్ఢంతో పాటు మార్కెట్ స్టామినా కూడా పెరుగుతూ ఉండాలి అని ఆలోచించే స్టార్ హీరోస్‌కి ఇలాంటి గ్యాప్స్ అస్సలు నచ్చవు. పైగా ఈ తరం స్టార్ హీరోలందరూ కూడా వందల సినిమాల విషయం పక్కన పెట్టినా గట్టిగా యాభై సినిమాలు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్, బన్నీలిద్దరూ కూడా అలర్ట్ అయిపోయారు. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో సినిమా చేస్తున్న బన్నీ ఆ తర్వాత సినిమా కోసం లింగుస్వామిని కూడా లైన్లో పెట్టాడు. అలాగే విక్రమ్ కుమార్‌తో కూడా కమిట్మెంట్ ఉందని తెలుస్తోంది. ఇక బాబీ డైరెక్షన్లో నటించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ కూడా నెక్ట్స్ సినిమా కోసం త్రివిక్రమ్‌తో అగ్రిమెంట్స్ చేయించాడు. అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నారని వినికిడి. అలాగే త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్‌తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాలో తనను ఎవ్వరూ చూపించినంత స్టైలిష్‌గా చూపించిన సుకుమార్‌తో ఎన్టీఆర్‌కి మంచి రిలేషన్ ఉంది. ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. 2016వ సంవత్సరం ఇచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ, ఎన్టీఆర్‌లు ఆ సంవత్సరం నేర్పిన లెస్సన్ని కూడా బాగానే ఒంటబట్టించుకున్నారన్నమాట. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకోవడం అభిమానులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆనందపరుస్తోంది.