జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు కానీ.. ఆయన్ని మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లోకి లాగేస్తూంటారు. అలా చేయవద్దని చెప్పినా పెద్ద ఇష్యూ అయిపోతుంది అందుకే ఎన్టీఆర్ అసలు స్పందించడం మానేశారు. తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని.. రాజకీయాల జోలికే పోనని ఆయన ఇటీవల మరోసారి హింట్ ఇచ్చారు.
హిందీలో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఆయనకు ఉన్న అశేష్ అభిమనుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాల్లేవా అని.. కపిల్ శర్మ ప్రశ్నించారు. బాక్సాఫీస్‌కు టిక్కెట్ బ్యాంక్‌గా మార్చుకుంటానని ఎన్టీఆర్ సూటిగా సమాధానం ఇచ్చారు. తాను సినిమాల్లో ఇంకా ఎంతో చోయాల్సి ఉందన్నారు
ఎన్టీఆర్ చాలా కాలంగా ఇదే చెబుతున్నారు. ఆయన ఇప్పుడు నేషనల్ రేంజ్ కు వెళ్లారు. హృతిక్ తో వార్ టు చేస్తున్నారు. ఆయన స్పష్టమైన హిందీతో పాటు నార్త్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రజెన్స్ ఉండటంతో బాలీవుడ్ లోనూ జెండా పాతుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డైవర్ట్ కాకుండా.. ఎన్టీఆర్.. పొలిటికల్ నీడ అనేది తన మీద పడకుండా చూసుకున్నారు.