ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. అందరు హీరోలు.. హిందీ సహా నాలుగైదు భాషల మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ప్రభాస్ ఈ విషయంలో అందరి కంటే చాలా ఎత్తుకు ఎదిగారు. మరో తెలుగు హీరో ఆ స్థాయికి వెళ్లలేదు. విజయ్ దేవరకొండకు కొంత క్రేజ్ వచ్చినా… మిస్ చేసుకున్నారు. చిరంజీవి సైరాకు.. పాన్ ఇండియా లుక్ ఇచ్చిన వర్కవుట్ కాలేదు. తర్వాత విజయ్ దేవరకొండ.. ఫైటర్‌తో పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు. పుష్పతో అల్లు అర్జున్ కూడా.. బిగ్ ఎయిమ్ పెట్టుకున్నానని.. అన్ని భాషల్లోనూ టైటిల్ రిలీజ్ చేసి చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పైనే పడింది. కథలు చెప్పే వాళ్లంతా.. పాన్ ఇండియా యాంగిల్లోనే చెబుతున్నట్లుగా తెలుస్తోది.
అయితే ఎన్టీఆర్ మాత్రం.. తనకు పాన్ ఇండియా అప్పీల్ కన్నా.. కంటెంట్ ముఖ్యమని చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం… రాజమౌళి క్రియేషన్.. ఆర్.ఆర్.ఆర్‌లో నటిస్తున్నారు. సహజంగానే దీనికి పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది. రాజమౌళి బ్రాండ్ దానికి పని చేస్తుంది. అయితే.. ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలకు ప్రాతిపదిక పాన్ ఇండియా మాత్రం కాదంటున్నారు. ఆర్ఆర్ఆర్ పని పూర్తయ్యాక.. ఎన్టీఆర్.. త్రివిక్రమ్‌తో కలిసి పని చేస్తారు. ఆ తర్వాత కొరటాల సినిమా కూడా ఉంటుంది. బెస్ట్ స్టోరీ నెరేటర్లతో కలిసి పని చేయాలనుకుంటున్న ఎన్టీఆర్… దానికి పాన్ ఇండియా అప్పీల్ అనే కటౌట్ మాత్రం.. ప్రామాణికం కాదని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా మెప్పించడం అంత తేలిక కాదు. హిందీ ప్రేక్షకుల అభిరుచి వేరు.. తమిళ ప్రేక్షకుల అతి అభిరుచి వేరు. అలాగే కేరళలో.. క్లాస్ .. ఆలోచింప చేసే సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. కన్నడలోనూ అంతే. ఇలా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించేలా.. యూనివర్శల్ అప్పీల్‌తో ఉన్న సినిమాలు తీయడం.. కత్తిమీద సాము లాంటిదే. రాజమౌళి లాంటి వాళ్లకే అది సాధ్యం. అందుకే.. ఎన్టీఆర్.. కటౌట్ కన్నా.. కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.