జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి? ఈ ప్రశ్న కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నలా తయారైంది. పదికి పైనే డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఇంచుమించుగా ఎన్టీఆర్‌తో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశమున్న డైరెక్టర్స్ అందరి పేర్లూ వినిపించాయి. ఇప్పుడిక ఫైనల్‌గా ఏ డైరెక్టర్ పేరు అఫిషియల్‌గా అనౌన్స్ చేసినా కూడా ఊహాగానాల్లో వినిపించిన ఏదో ఒక డైరెక్టర్ పేరు అయి ఉండాల్సిందే.
జనతా గ్యారేజ్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో జనతా గ్యారేజ్‌ని మించి అనే స్థాయి సినిమా చేయాలని ఒక టైంలో చాలా గట్టిగా ట్రై చేశాడు ఎన్టీఆర్. లింగుస్వామితో బై లింగ్వల్ సినిమా, త్రివిక్రమ్‌తో భారీ బడ్జెట్ సినిమా…ఇలా కొన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యేలా కనిపించాయి. కానీ చివరి నిమిషంలో తేడాలొచ్చేశాయి. ఇప్పుడెలాగూ వినాయక్‌ని మినహాయిస్తే ఆప్షన్స్‌లో ఉన్న మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా మీడియం రేంజ్ వాళ్ళే ఉన్నారు. అసలు జనతా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే ఆ సినిమాపైన పూర్తి హోప్స్ పెట్టకున్న ఎన్టీఆర్…జనతా తర్వాత సినిమాను తన అన్న కళ్యాణ్ రామ్‌కు లాభం చేకూర్చేలా ప్లాన్ చేయాలనుకున్నాడు. వక్కంతం వంశీతో అనుకున్న ఆ సినిమా కాస్తా డిస్కషన్స్ స్టేజ్‌లోనే ఆగిపోయింది. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మీడియం రేంజ్ డైరెక్టర్స్‌తో సినిమా చేయాల్సిన పరిస్థితులు రావడంతో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పైనే ఆ సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ వరుసగా ఫ్లాప్స్ ఇచ్చి ఉన్న ప్రొడ్యూసర్, బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో సినిమా అంటే ప్రి రిలీజ్ బిజినెస్ మరీ డౌన్ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నాడట ఎన్టీఆర్. అలాగని ఇప్పుడున్న పొజిషన్లో చూసుకున్నా కూడా సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇంచుమించుగా పదిహేను కోట్లపైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశమున్న ప్రాజెక్ట్‌ని వేరే ప్రొడ్యూసర్ చేతుల్లో పెట్టడానికి కూడా రెడీగా లేడు ఎన్టీఆర్. దిల్ రాజు లాంటి వాళ్ళతో టై అప్ అవుతాడో…లేకపోతే కొంచెం రిస్క్ అయినా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లోనే సినిమాను స్టార్ట్ చేస్తాడో చూడాలి మరి. ఏది ఏమైనా తన సొంత ప్రయత్నాలతో భారీగా ఎదురు దెబ్బలు తిన్న కళ్యాణ్ రామ్‌కి ఎన్టీఆర్ సినిమాతో డబ్బులకు డబ్బులు, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌కి ఫుల్ క్రేజ్ కూడా వచ్చేయడం ఖాయమని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు.