టెంపర్ సినిమాకు ముందు వరకూ ఎన్టీఆర్ చాలా సమస్యలే ఫేస్ చేశాడు. తక్కువ బడ్జెట్లో అయితే సినిమా చేస్తామని, రెమ్యూనరేషన్‌ని కాస్త తగ్గించుకోవాలని కొంత మంది ప్రొడ్యూసర్స్ డైరెక్ట్‌గానే అడిగేశారు. ఇక బండ్ల గణేష్ క్రియేట్ చేసిన సీన్ గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. మీడియా వాళ్ళు కూడా ఎన్టీఆర్‌ని నంబర్ ఒన్ రేసు నుంచి తప్పించేశారు. రెండు పదుల వయసులోనే సూపర్ స్టార్ ఢంని సాధించిన ఎన్టీఆర్‌కి ఇవన్నీ చేదు మాత్రలే. అయితే ఆ విషయాల నుంచే ఎన్టీఆర్ చాలా విషయాలు నేర్చుకున్నాడు.
టెంపర్ సినిమా నుంచి కెరీర్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో పాటు నంబర్ ఒన్ రేసులోకి దూసుకొచ్చేశాడు. అయితే సక్సెస్‌తో పాటు బాధ్యతలు, భయాలు కూడా బోలెడన్ని వస్తాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చేయబోయే సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకుమించి అనే స్థాయిలో ఉండాలి అనేది ఎన్టీఆర్ టార్గెట్. సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సూపర్ బజ్ క్రియేట్ అవ్వాలి, ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జనతా గ్యారేజ్‌ని మించి జరగాలి, ఆ తర్వాత సిినిమా కూడా అంతకుమించి అనే స్థాయిలో హిట్ అవ్వాలి….అదీ ఈ నందమూరి హీరో టార్గెట్. టెంపర్ సినిమా నుంచి కూడా సినిమా… సినిమాకూ ఇలానే ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు నాలుగోసారి కూడా ఆ విషయంలో సక్సెస్ అయ్యాడంటే మాత్రం అద్భుతమైన విజయం సాధించినట్టే. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ కూడా పీక్స్‌కి వెళ్ళిపోతుంది. అలా జరగాలంటే డైరెక్టర్స్ ఎంపిక విషయంలోనే చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. కానీ ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఆప్షన్స్ లేవు. ఒక్క పూరీ జగన్నాథ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇజం సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉంటే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉండేవాడు ఎన్టీఆర్. ఇప్పుడు మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలా? వద్దా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. అలాగే నవంబర్‌లో సురేందర్‌రెడ్డి ఫ్రీ అవుతున్నాడు. డిసెంబర్ నుంచి అయితే వినాయక్‌తో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్‌కి సన్నిహితులే. అలాగే ఈ ఇద్దరి డైరెక్టర్స్‌తో ఓ గొప్ప కంఫర్ట్ ఏంటంటే ఎన్టీఆర్‌కి నచ్చిన కథతో సినిమా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే కథలు వింటూ ఉన్న ఎన్టీఆర్‌కి నవంబర్, డిసెంబర్ల నాటికి ఆయనకు నచ్చిన స్టోరీ దొరకడం కూడా పెద్ద కష్టం కాదు. సో….ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ అదే అయ్యే అవకాశం ఉందని సోర్సెస్ ద్వారా తెలుస్తోంది.