‘దేవర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ‘దేవర’ సక్సెస్ మీట్ కూడా నిర్వహించుకొనే అవకాశం రాలేదు. అప్పట్నుంచి అభిమానుల్ని స్వయంగా కలవాలని ప్లాన్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. ఇటీవల ‘మ్యాడ్ 2’ సక్సెస్ మీట్ లో కనిపించాడు తారక్. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమా వేడుకలో మెరిశాడు. మార్చిలో ఎన్టీఆర్ తో ఫ్యాన్స్ మీట్ ఉండాలి. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కనీసం 3 వేలమందిని కలవాలని ఎన్టీఆర్ భావించారు. కానీ అప్పుడు కూడా కుదర్లేదు. అయితే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అభిమానుల్ని త్వరలోనే కలుస్తా, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని మాట ఇచ్చేశాడు ఎన్టీఆర్. వేసవి ప్రభావం తగ్గాక, అభిమానుల్ని కలుస్తానని, వాళ్లని ఇబ్బంది పెట్టకూడదనే ఈ నిర్ణయం తీసుకొన్నానని, కాస్త ఆలస్యమైనా అభిమానుల్ని కలవడం పక్కా అని తీపి కబురు చెప్పాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వార్ 2’ ఆగస్టు 14న రాబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా జరుగుతోంది. ‘వార్ 2’ సినిమా అద్భుతంగా వచ్చిందని, అభిమానుల్ని తప్పకుండా అలరిస్తుందని ‘వైజయంతీ’ ప్రీ రిలీజ్ సినిమాలో అభిమానులకు మాట ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ప్లాన్ చేసే అవకాశం వుంది. జూన్, లేదా జులైలో ఈ మీట్ ఉండొచ్చు.