అభిమానులే నా బలం అని చెబుతుంటారు స్టార్ హీరోలు. అది నిజం కూడా. హీరోల స్థాయి పెరగడానికి, వాళ్ల ఇమేజ్‌కీ, పేరు పలుకుబడికీ కారణం అభిమానులే. ఆ విషయం స్టార్స్‌కీ తెలుసు. అందుకే అభిమానులు ఆపదలో ఉన్నారంటే తల్లడిల్లిపోతుంటారు. క్లిష్టమైన సందర్భాల్లో ‘నేనున్నా’ అంటూ భరోసా ఇస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ అదే చేశాడు. తన వీరాభిమానికి బాసటగా నిలిచాడు. కాన్సర్‌తో బాధపడుతున్న అభిమాని దరికి చేరి.. ఔదార్యం చూపించాడు. బెంగళూరుకు చెందిన నాగార్జున ఎన్టీఆర్ కి వీర ఫ్యాన్స్. అయితే గత కొంతకాలంగా నాగార్జున క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ను కలవాలన్నది నాగార్జున కోరిక. ఈ విషయం తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ శనివారం నాగార్జునని పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. ‘ఎప్పుడు ఏం సహాయం కావాలన్నా.. నేనున్నానన్న సంగతి మర్చిపోకు’ అని భరోసా ఇచ్చాడు. తన అభిమాన నటుడ్ని చూడగానే నాగార్జున కాసేపు ఏడ్చేశాడు కూడా. నాగార్జునని ఓదార్చి..తన చేతిలో స్వయంగా టాబ్లెట్స్ అందించాడు ఎన్టీఆర్.