గాయం గారణంగా `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్‌కి ఎన్టీఆర్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు చరణ్ కూడా గాయపడడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. గాయం నుంచి రామ్ చరణ్ కోలుకున్నాడు. ఎన్టీఆర్ కూడా గాయం నుంచి కోలుకున్నాడని, `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్లో పాలుపంచుకుంటున్నాడని చెబుతున్నారు. కానీ.. ఎన్టీఆర్‌ని చూస్తుంటే మాత్రం గాయం ఇంకా మానలేదనిపిస్తోంది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌కి వచ్చి, తాతయ్యకు నివాళులు అర్పించాడు ఎన్టీఆర్. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతి కట్టు అలానే ఉంది. దాన్ని బట్టి ఎన్టీఆర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదని అర్థం అవుతోంది. చేతి కట్టు ఉండగానే.. షూటింగ్లో పాలు పంచుకోవడం కష్టం. గాయం తగ్గకుండా మళ్లీ షూటింగులు చేసుకుంటూ పోతే.. గాయం తిరగబడే ప్రమాదం ఉంది. ముందు జాగ్రత్తగా ఆ కట్టు అలానే ఉంచుకుంటే ఫర్వాలేదు. గాయం ఇంకా తగ్గకపోతే మాత్రం ఎన్టీఆర్ ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోక తప్పదు.