తెలుగు సినిమాల షూటింగుల అడ్డా… అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎన్టీఆర్ సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా `దేవర` షూటింగ్ అక్కడే జరుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటోంది. 2 వారాల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్తవుతుంది. మరో షెడ్యూల్ పాటల కోసం కేటాయించారు. ఎన్టీఆర్ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించే ఈ చిత్రంలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2024 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. అందుకే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `దేవర` 2 భాగాలుగా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. 2024 వేసవిలో తొలి భాగం విడుదల అవుతుంది. మరో ఆరు నెలల విరామం తరవాత.. రెండో భాగం వస్తుంది.