యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే అదో సెపరేట్ క్రేజ్.. వీర రసాన్ని పండించడంలో ఇప్పటి హీరోల్లో ఎన్టీఆర్ కే పట్టం కట్టేయవచ్చు. అయితే అలాంటి హీరో ఇప్పుడు క్లాసిక్ అండ్ రొమాంటిక్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్లో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ నిమ్మిత్తం దాదాపు రెండు నెలల నుండి లండన్లోనే ఉన్నాడు. సుక్కు సినిమా అంటేనే మంచి ఎమోషనల్ ట్రీట్ అలాంటి ఎమోషనల్ దర్శకుడికి ఇంకో ఎమోషనల్ స్టార్ తగిలితే ఎలా ఉంటుందో అచ్చం నాన్నకు ప్రేమతో అలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
అయితే రీసెంట్ గా అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఎన్టీఆర్, ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు సినిమా చూశాడట. ఇన్నాళ్లు ఫ్యామిలీకి దూరంగా ఉండి షూటింగ్లో బిజీ అయిన ఎన్టీఆర్ వచ్చిన ఈ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే నాన్నకు ప్రేమతో ఇంకో షెడ్యూల్ హైదరబాద్ లోనే షూట్ చేస్తారట.
ఫ్యామిలీతోశ్రీమంతుడు చూసిన ఎన్టీఆర్ మహేష్ సినిమాను బాగా నచ్చాడని టాక్. అయితే సినిమా గురించి ఏం మాట్లాడక పోయినా సినిమా చాలా బాగుందని అన్నాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. బాహుబలి తర్వాత అంతటి భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా శ్రీమంతుడు విజయఢంఖా మోగించాడు. రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 170 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ టాక్.