దిల్‌రాజు హ్యాండే హ్యాండు. ఆయన చేయి వేస్తే.. సినిమా హిట్టయి తీరాల్సిందే. అప్పుడప్పుడూ ఆయనజడ్జిమెంట్ తప్పినా.. చాలా సార్లు దిల్‌రాజు సినిమా భవిష్యత్తుని అంచనా వేయడంలో దిట్ట అనేపేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడాయన చూపు జనతా గ్యారేజ్‌పై పడింది. ఈ సినిమా నైజాం రైట్స్‌ని దిల్‌రాజు దక్కించుకొన్నారని టాక్. రేటు ఎంతో చెప్పకపోయినా… దాదాపు రూ.14 నుంచి రూ16 కోట్ల వరకూ ఉండొచ్చని ఓ అంచనా! నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ ఫామ్ లోకి వచ్చాడు. మిర్చి, శ్రీమంతుడు తరవాత కొరటాల హ్యాట్రిక్‌కి రంగం సిద్దం చేసుకొన్నాడు. కాబట్టి ఈసినిమాపై క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు.
నైజాం పరంగా… ఈ సినిమాపై భారీ ఎత్తున పోటీ ఏర్పడింది. దిల్‌రాజు కొనాలనుకొన్న సినిమాలన్నీ అభిషేక్ పిక్చర్స్ సంస్థ పోటీ పడి మరీ.. దక్కించుకొంటున్నారు. అయితే ఈసారి దిల్ రాజు ఓ అడుగు ముందున్నాడు. వాళ్లకంటే ముందే కర్చీఫ్ వేసి ఫ్యాన్సీ రేటుకి ఈ సినిమా చేజిక్కించుకొన్నాడు. ఓవర్సీస్ నుంచి కూడా జనతా గ్యారేజీకి భారీ ఆఫర్లు వస్తున్నట్టు టాక్. అయితే.. ఆ విషయంలో చిత్రబృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి త్వరలోనే ఓ టీజర్‌ని వదలాలని చిత్రబృందం భావిస్తోందట.