తమ సినిమాల్లో ఇంట్రవెల్ బ్యాంగుని ఓ రేంజులో ప్లాన్ చేసుకొంటున్నారు కమర్షియల్ దర్శకులు. అప్పటి వరకూ కథ ఒక యెత్తు. అక్కడ్నుంచి మరో ఎత్తన్నమాట. తన తొలి సినిమా మిర్చిలో అదే రూలు ఫాలో అయ్యాడు కొరటాల శివ. శ్రీమంతుడుతో స్కీమ్ కాస్త మారినా, ఇంట్రవెల్ ట్విస్టు అదిరిపోయింది. ఇప్పుడు జనతా గ్యారేజీలోనూ ఇంట్రవెల్ ట్విస్టు అదిరిపోయిందట. కథ అక్కడ్నుంచి ఓ రేంజులోకి మారిపోతుందని, జనతా గ్యారేజీ మైలేజీ ఆ సీన్లో రెట్టింపు అవుతుందని టాక్.
ఇందులో ఎన్టీఆర్ కి పెదనాన్నగా నటిస్తున్నాడు.. మోహన్‌లాల్ . ఫస్టాఫ్ లో సాదీ సీదాగా, ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించిన మోహన్‌లాల్ ఇంట్రవెల్లో ఓ భారీ ట్విస్టు ఇస్తాడట. తనో డాన్ అని, ఓ మిషన్ కోసం అనామక జీవితాన్ని గడపాల్సివస్తుందని తెలుస్తుందట. ఆ ట్విస్టు ఎన్టీఆర్‌కీ షాక్నిచ్చేదేనట. మోహన్‌లాల్ అసలు స్వరూపం ఏమిటన్నది సెకండాఫ్‌లో తేలుతుందట. ఒక విధంగా మోహన్‌లాల్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని, అదే… ఈ సినిమాకి ప్రధానమని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాని కాస్త క్లాసీగా తీసిన కొరటాల.. ఎన్టీఆర్ కోసం మాత్రం పూర్తిగా కమర్షియల్ దారిలోనే వెళ్లిపోతున్నాడన్నాట. చూద్దాం.. ఆ ట్విస్టు వెండితెరపై ఏ స్థాయిలో అదురుతుందో?