నందమూరి బాలకృష్ణకు ముహూర్తాలపై నమ్మకం ఎక్కువ. పంచాంగం చూడనిదే ఆయన కాలు కూడా బయట పెట్టరు. ఈ విషయం ఆయన అభిమానులకు బాగా తెలుసు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు కూడా అనుకున్న ముహూర్తానికే జరుగుతుతాయి. తన సినిమా తొలి `షో` ఎప్పుడు పడాలి? అనే విషయంలోనూ ఆయన ముహూర్తాలనే ఫాలో అవుతారు. గత కొన్ని సినిమాలుగా బాలయ్య పెట్టిన ముహూర్తానికే ప్రీమియర్లు కూడా పడుతున్నాయి. `ఎన్టీఆర్` (కథానాయకుడు) ఈనెల 9న రానుంది. దానికీ బాలయ్య టైమ్ ఫిక్స్ చేశారు. 9వ తారీఖు ఉదయం 5 గంటలకు షో పడాలని ఆయన ముహూర్తం పెట్టారు. అదే సమయానికి భ్రమరాంబలో ఓ ప్రత్యేకమైన షో వేయనున్నారు. నిజానికి హైదరాబాద్లో ప్రీమియర్ షోలకు అనుమతి లేదు. కానీ.. బాలయ్య కోసం ఆ ఒక్క థియేటర్లోనే తెల్లవారుఝామున షోకి అనుమతి తీసుకున్నారు. ఆ ఆటకు బాలయ్య, టీమ్ పాల్గొంటారు. ఆంధ్రలో అయితే.. 5 గంటలకంటే ముందే షోలు పడే అవకాశం ఉంది.