యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు (October 25) హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో చిత్ర బృందం నడుమ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నందమూరి కళ్యాణ్ రామ్ , బి వి ఎస్ ఎన్ ప్రసాద్, పొట్లూరి వి ప్రసాద్ (PVP), శ్యాంప్రసాద్ రెడ్డి, శిరీష్ రెడ్డి ,దానయ్య డి వి వి, ఆచంట రామ్, ఆచంట గోపి , వి. వి వినాయక్, ఎర్రబెల్లి దయాకర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టగా, ఆయన తనయుడు అభయ్ రామ్ తో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ :
కొరటాల శివ తో నాకు బృందావనం రోజుల నుండి అనుబంధం ఉంది. అయన ఒక అధ్బుతమైన రచయిత. ఒక అభిరుచి గల డైరెక్టర్. క్లాస్, మాస్ అంశాలను ఆయన బాలన్స్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ అందించిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీస్ సంస్థ తో పని చేయటం ఆనందం గా ఉంది.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా అయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. జనవరి లో షూటింగ్ ను ప్రారంభించి, ఆగస్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్ లు, ఒక ముఖ్య పాత్ర లో చాలా ప్రముఖ నటుడు ఉంటారు. ఈ వివరాలను త్వరలో తెలియజేస్తాం.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ :
మంచి చిత్రాలను ఉత్తమ సాంకేతిక విలువలతో ప్రేక్షకులకు అందించాలనే ఆశయం తో మైత్రీ మూవీస్ సంస్థ ను ప్రారంభించాం. మా రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో తో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా బ్యానర్ లో మొదటి చిత్రం అయిన ‘శ్రీమంతుడు’ ని బ్లాక్బస్టర్ గా తీర్చిదిద్దిన మా డైరెక్టర్ కొరటాల శివ గారితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషం గా ఉంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని భారీ వ్యయం తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. జనవరి 2016 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 12న, కృష్ణా పుష్కరాల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి – మది . ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ – ఎ. ఎస్. ప్రకాష్ నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) కథ – మాటలు – దర్శకత్వం – కొరటాల శివ. Executive Producer- చంద్రశేఖర్ రావిపాటి
ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.