ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా చివరి షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నాడు. అయితే యంగ్ టైగర్ ఆ సినిమా తర్వాత నటించే సినిమా కొరటాల కాంబినేషన్లో ఉంటుందని ఫిక్స్ అయ్యింది. రేపు దీనికి సంబందించిన ముహుర్తం పెట్టనున్నారట. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవర పెడుతున్న మరో న్యూస్ ఏంటంటే ఈ సినిమాకు కొరటాల శివ అనుకున్న టైటిల్. సాధారణంగా రచయిత, దర్శకుడు తానే అవ్వడం వలన కొరటాల శివ సినిమా కథ అనుకున్నప్పుడే దానికి తగ్గ టైటిల్ ఫిక్స్ చేస్తాడు.
అయితే అలానే ఎన్టీఆర్ సినిమాకు కూడా ‘జనతా గ్యారేజ్’ ట్యాగ్ లైన్ గా ‘అన్ని రిపేర్లు చేయబడును’ అని పెట్టనున్నాడట. ఈ టైటిల్ విన్న ఫ్యాన్స్ అంతా షాకింగ్ లో ఉన్నారు. అయితే టైటిల్ కాస్త కొత్తగా ఉన్నా అన్ని ఎమోషన్స్ సినిమాలో ఉంటాయని అంటున్నాడు కొరటాల శివ. కాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ ని అసలు యాక్సెప్ట్ చెయట్లేదు సరికదా కొరటాల శివకు మెసేజెస్ రూపంలో వార్నింగ్స్ ఇస్తున్నారట.
తన కథకు సరితూగే టైటిల్ ఫిక్స్ చేసే కొరటాల శివకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో తలనొప్పి స్టార్ట్ అయ్యింది. మరి వారిని కాదని అదే టైటిల్ తో సినిమా తీసిన వారికి నచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ముందే వారు సినిమా మీద ఒకరకమైన నెగిటివ్ ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి. మరి ఈ టైటిల్ సంక్షోభం నుండి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.