రచయిత వక్కంతం వంశీకి మెగాఫోన్ పట్టుకోవాలని ఎప్పట్నుంచో ఓకల. ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పి ఓకే అనిపించుకొన్నాడు. రెండేళ్ల నుంచీ.. ఎన్టీఆర్ వెంటే తిరుగుతున్నాడు. తాను ముచ్చట పడి రాసుకొన్న టెంపర్ కథని కూడా ఎన్టీఆర్ కోసం పూరి జగన్నాథ్‌కి ఇచ్చేశాడు. మరే సినిమా కోసం పనిచేయకుండా.. ఎన్టీఆర్ పిలుపు కోసం ఎదురు చూశాడు వంశీ. అయితే… ఎన్టీఆర్ మాత్రం కనికరించడం లేదు. జనతా గ్యారేజ్ తరవాత వక్కంతం సినిమానే పట్టాలెక్కాలి. అందుకోసం సర్వం సిద్ధమైంది కూడా. అయితే… ఎన్టీఆర్ మాత్రం సముఖంగా లేడని టాక్. ఎన్టీఆర్ చూపు పూరి జగన్నాథ్ వైపు ఉందని, జనతా తరవాత పూరి సినిమానే పట్టాలెక్కుతుందని టాక్. దాంతో వంశీకి నిరాశ తప్పేట్టు లేదు. వంశీ కూడా.. ఎన్టీఆర్ కథని రవితేజకు వినిపించాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌ని నమ్ముకొని రెండేళ్లు వృథా చేసుకొన్నానని వంశీ సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతున్నాడట.
అయితే… ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం.. ‘కంగారు పడొద్దు.. ఎన్టీఆర్ తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు’ అంటూ ఓదారుస్తున్నట్టు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ కూడా వక్కంతంనే సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా సరే.. వక్కంతం – ఎన్టీఆర్‌ల సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. వరుస హిట్లతో ఊపుమీదున్న ఎన్టీఆర్ మాత్రం.. తన ఫామ్‌ని కాపాడుకోవాలంటే పూరిలాంటి సీనియర్నే నమ్ముకొంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నాడు. అందుకే.. వంశీని పక్కన పెట్టాడట. పూరి సినిమా అయ్యాక ఆ ఫలితం బట్టి వంశీకి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. కానీ వంశీ అప్పటి వరకూ ఆగేట్టు లేడు. ఇప్పటికే చాలా సమయం వృథా అయ్యిందని, ఇక వేచి చూడాల్సిన పనిలేదని వంశీ ఫీల్ అవుతున్నాడట. సో.. రవితేజతో వంశీ ప్రొసీడ్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది.