NTR మీద బయోపిక్స్ అంటూ దాదాపు 3 సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. తేజ- బాలకృష్ణ, వర్మ, జగదీశ్వర రెడ్డి సినిమాలు అనౌన్స్ అయి పోటాపోటీ గా సినిమాలు తీస్తామని డిబేట్లు జరుగుతున్నాయి కానీ సినిమాలు మాత్రం మొదలవడం లేదు. తేజ వెంకీ తో, వర్మ నాగ్ తో సినిమాలు చేసుకుంటూ ఉంటే బాలయ్య వేరే దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, MGR మీద బయోపిక్ మాత్రం చడీ చప్పుడు లేకుండా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని ఏకంగా ముఖ్యమంత్రి క్లాప్ తో ప్రారంభమైంది.
ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి క్లాప్ కొట్టారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర వెండితెర కెక్కునున్న విషయం తెలిసిందే. ఏ.బాలకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రానికి ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా సతీష్‌కుమార్ నటిస్తుండగా, అన్నాదురైగా దర్శకుడు ఎస్ఎస్.స్టాలిన్ నటిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్శకుడు వెల్లడించారు.