“2019 ఎనికల్లో ప్రజలముందుకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాబోతోంది. మరి ఈ పార్టీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి?” ఇదీ జై లవ కుశ ప్రమోషన్స్ లో భాగంగా టివి ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న జూనియర్ ఎన్ టీఆర్ కి ప్రముఖ ఛానెల్లో ఇవాళ ఎదురైన ప్రశ్న.
ఈ మధ్య టివి ఛానెళ్ళల్లోనూ, సోషల్ మీడియా వెబ్ ఛానెళ్ళలోనూ, సినీ రాజకీయ వర్గాలకి చెందిన ఎవరినీ ఇంటర్వ్యూలు చేస్తున్నా, సీరియస్ గానో లేక యధాలాపంగానో ఎదురవుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానంగా – కొంతమంది జనసేన కి సపోర్ట్ గా సమాధానమిస్తే, కొందరు డిప్లమటిక్ సమాధానాలతో తప్పించుకుంటూ ఉంటే ఎవరో ఒకరిద్దరు నెగటివ్ వ్యాఖ్యానాలు చేసి, కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి యాంకర్, జూనియర్ ఎన్ టీఆర్ ని ఈ ప్రశ్న ని అడగ్గానే ఒక్కసారిగా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది – ఏం సమాధానం చెబుతాడోనని.
అయితే జూనియర్ ఎన్ టీఆర్ మాత్రం చాల మెచ్యూర్డ్ గా స్పందించాడు. ఆయన సమాధానమిస్తూ, – ” నాకు బేసిగ్గా ఏ పొలిటికల్ పార్టీ మీదా ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్స్ లాంటివేమీ లేవు. ఒక భారతదేశ పౌరుడిగా ఏ పార్టీ అయినా సరే, ప్రజలకి మంచి జరిగితే చాలు అనుకుంటాను” అంటూ సమాధానమిచ్చాడు. మొత్తానికి పబ్లిక్ ప్లాట్ ఫాం మీద జూనియర్ ఎన్ టీఆర్ మొదటి సారిగా జనసేన గురించిన ప్రశ్నకి స్పందించిన విధానమిది.